అనుష్క కోసమే ఈ మూవీ ఒప్పుకున్నా.. డెడ్ సీన్ ఉండకూడదని కాంట్రాక్టులో రాయించా
on Sep 3, 2023
సుమ అడ్డా షో ఈ వారం అద్దిరిపోయే పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి నవీన్ పోలిశెట్టి వచ్చాడు. "లాస్ట్ టైం మనమొక షో చేసాం. షో హిట్ అయ్యింది. మా జాతిరత్నాలు సినిమా కూడా హిట్ కొట్టింది. చెప్పాలంటే సుమ గారే మా లేడీ లక్..ఇక ఈసారి కూడా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నా..నిజం చెప్పాలి అంటే స్క్రిప్ట్ బాగుందని ఈ మూవీ ఒప్పుకున్నాను అనుకుంటారు కానీ అనుష్క గారు ఉన్నారని ఈ మూవీకి ఒప్పుకున్నా" అన్నాడు.
తర్వాత ఆరియానా, శివజ్యోతితో గేమ్ ఆడించింది సుమ. "చెప్పండి హ్యాంగోవర్ గురించి ఏం చెప్తారు" అనేసరికి "నేను అసలు అలాంటి పనులు చేయను. నాకు హ్యాంగోవర్ అంటే ఏంటో తెలీదు" అని చెప్పింది ఆరియానా. పక్క నుంచి శివజ్యోతి మాత్రం పడీ పడీ నవ్వింది ఆ జోక్ విని. తర్వాత నవీన్ , మహేష్ తో గేమ్ ఆడించింది. "అనుష్క గారి మూవీస్ చూసారు కదా. ఆమె చేసిన వార్ జోన్ మూవీస్ లో హీరో స్టార్టింగ్ లోనే చనిపోతాడు. ఐతే ఈ మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి స్టోరీ చెప్పినప్పుడు కూడా అదే విషయాన్నీ అడిగాను. ఎన్నో మినిట్ లో నన్ను లేపేస్తారు అని అడిగాను. ఐతే ఈ మూవీలో అలా ఉండదు ఇద్దరూ ఎండింగ్ వరకు ఈక్వల్ గా చేస్తారు అని చెప్పారు.. కాంట్రాక్టు లో ఫస్ట్ ఆ విషయాన్ని రాయించాను .. డెడ్ సీన్ అనేది రాకూడదు అని చెప్పాను.." అంటూ ఈ మూవీకి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు నవీన్.